Hyderabad News: గచ్చిబౌలిలో ప్రమాదం.. రోలింగ్‌ షట్టర్‌లో పడి బాలుడి మృతి

ఆటోమేటిక్‌ రోలింగ్‌ షట్టర్‌లో పడి బాలుడు మృతిచెందిన ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో చోటు చేసుకుంది. రాయదుర్గం పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. తూర్పుగోదావరి జిల్లా అలమూరు

Updated : 11 Aug 2021 12:57 IST

రాయదుర్గం: ఆటోమేటిక్‌ రోలింగ్‌ షట్టర్‌లో పడి బాలుడు మృతిచెందిన ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో చోటు చేసుకుంది. రాయదుర్గం పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. తూర్పుగోదావరి జిల్లా అలమూరు గ్రామానికి చెందిన అర్జున్‌, దేవి దంపతులు వారి కుమారులు రాజేశ్‌ (10), భాను ప్రకాశ్‌లతో కలిసి ఉపాధి నిమిత్తం ఏడాది క్రితం నగరానికి వచ్చారు. అర్జున్‌.. గచ్చిబౌలి అంజయ్య నగర్‌ కేఎన్‌ఆర్‌ స్వ్కేర్‌ భవనంలో సెక్యురిటీ గార్డుగా చేరాడు.

ఈ ఉదయం రాజేశ్‌ ఆడుకుంటూ వెళ్లి మొదటి అంతస్తులో ఉన్న ఆటోమేటిక్‌ రోలింగ్‌ షట్టర్‌ మీట నొక్కడంతో.. ఒక్కసారిగా షట్టర్‌ బాలుడిని చుట్టేసుకుంది. కొద్దిసేపటి తర్వాత కుమారుడి కోసం వెతకగా అర్జున్‌కు షట్టర్‌ వద్ద బాలుడి కాళ్లు కనిపించాయి. వెంటనే బాలుడిని బయటకు తీయగా అప్పటికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని