Published : 03/09/2021 01:52 IST

Bus accident: డోన్‌లో బస్సు బీభత్సం.. వంతెన అంచున ఆగిన మృత్యువు

డోన్‌: కర్నూలు జిల్లా డోన్‌ పట్టణంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. కారును తప్పించబోయి ఆర్టీసీ బస్సు ఫ్లై ఓవర్‌ దిమ్మెలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు అనంతపురం నుంచి కర్నూలు బయలుదేరింది. డోన్‌ పట్టణంలోకి రాగానే కారును తప్పించబోయి ఫ్లై ఓవర్‌ దిమ్మెలను ఢీకొట్టి ఆగింది. కొంచెం పట్టు తప్పి ఉంటే వంతెనపై నుంచి బస్సు కింద జనాలపై పడేదని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. దిమ్మెలను బస్సు బలంగా ఢీకొట్టడంతో ఉపరితల వంతెన కింద రహదారిపై పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులపై పెచ్చులూడి పడ్డాయి. ఈఘటనలో పదో తరగతి విద్యార్థులు వంశీ, నూర్‌ భాషా, వరుణ్‌ ఆదిత్యకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ఉన్న 21 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని