CRIME NEWS: అతి వేగానికి మూల్యం.. ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

నగర శివారు నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గండిపేట వద్ద గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. అతి వేగంతో అదుపుతప్పిన కారు విద్యుత్‌ స్తంభాన్ని

Updated : 13 Aug 2021 04:40 IST

హైదరాబాద్‌: నగర శివారు నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గండిపేట వద్ద గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. అతి వేగంతో అదుపుతప్పిన కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. 

పోలీసుల కథనం ప్రకారం.. గండిపేట నుంచి నార్సింగ్‌ వైపు వెళ్తున్న కారులో ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. కారు వేగంగా వెళ్తున్న సమయంలో ఆటో అడ్డు రావడంతో దాన్ని తప్పించబోయి రోడ్డుపక్కనే విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులు కౌశిక్‌, జోడౌన్‌గా గుర్తించారు. గాయపడిన మరో ముగ్గురు విద్యార్థులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కౌశిక్‌ అనే విద్యార్థికి సీబీఐటీ కాలేజిలో ఎగ్జామ్‌ ఉందని వీరంతా అతనికి తోడుగా గండిపేట వచ్చారు. కాలేజి నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న నార్సింగ్‌ పోలీసులు, ట్రాఫిక్‌ పోలీసులు క్లూస్‌ టీమ్‌ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని