బావిలో కారును బయటకు తీసిన అధికారులు.. ఒక మృతదేహం లభ్యం

కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న మల్కనూరు వద్ద ఈ ఉదయం బావిలోకి  దూసుకెళ్లిన కారును ఎట్టకేలకు అధికారులు బయటకు తీశారు. బావిలో 60 అడుగుల

Updated : 30 Jul 2021 05:50 IST

చిగురుమామిడి: కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు వద్ద ఈ ఉదయం బావిలోకి  దూసుకెళ్లిన కారును ఎట్టకేలకు అధికారులు బయటకు తీశారు. బావిలో 60 అడుగుల మేర నీరు ఉండటంతో కారును బయటకు తీయడం రెస్క్యూ టీమ్‌కు కష్టంగా మారింది. దాదాపు 8గంటల పాటు శ్రమించిన అధికారులు ఎట్టకేలకు క్రేన్‌ సాయంతో కారును బయటకు తీశారు. కారు అద్దాలు తెరచి చూడగా.. అందులో ఒక మృతదేహం లభ్యమైంది. మృతుడు విశ్రాంత ఉద్యోగి పాపయ్య నాయక్‌గా గుర్తించారు. భీమదేవరపల్లి మండలం సూర్యానాయక్‌ తండా ఆయన స్వస్థలం. పాపయ్య నాయక్‌ హుస్నాబాద్‌ అక్కన్నపేటలో గతంలో ఎస్సైగా విధులు నిర్వహించి... ఇటీవలే పదవీ విరమణ పొందారు. కరీంనగర్‌ నుంచి కారులో ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కారులో నలుగురైదుగురు ఉన్నట్టు తొలుత పోలీసులు భావించారు. కానీ, కారు బయటకు తీసిన తర్వాత అందులో ఒక మృతదేహాన్ని గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని