Published : 06/11/2021 02:05 IST

Crime News: షోరూం నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా అదుపుతప్పిన కారు

తిరుపతి నేర విభాగం: కొత్త కారు కొనుగోలు చేసి ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్తుండగా టైరు పేలి ఆ వాహనం అదుపుతప్పిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి అక్కారంపల్లికి చెందిన శ్రీ లక్ష్మీనరసింహ ఓ కొత్త కారును కొనుగోలు చేశారు. ఆ కారును షోరూం నుంచి లీలామహల్‌ వైపున్న తన నివాసానికి తీసుకెళ్తుండగా స్థానిక ఎస్కే ఫాస్ట్‌ఫుడ్స్‌ వద్ద టైరు పేలి ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కనున్న జనాలు, వాహనాలపైకి ఆ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా.. ఆరు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన వెంటనే కారులోని వ్యక్తి తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.


Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని