
Crime News: దుబ్బాకలో బావిలోకి దూసుకెళ్లిన కారు.. సహాయక చర్యల్లో విషాదం
దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ వద్ద కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది. వెలికితీసిన కారులో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా.. కారును బావి నుంచి బయటకు తీసేందుకు సహాయ చర్యల్లో పాల్గొన్న గజఈతగాడు కూడా మృతి చెందాడు.
ఇవాళ మధ్యాహ్నం దుబ్బాక మండలం చిట్టాపూర్ వద్ద టైరు పేలడంతో కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. దాదాపు 6 గంటల పాటు కారును బావి నుంచి వెలికితీసేందకు సహాయక చర్యలు కొనసాగాయి. గజఈతగాళ్ల సాయంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కారును తీసేందకు ప్రయత్నించారు. రెండు మోటార్ల సాయంతో బావిలోని నీటిని ఖాళీ చేసేందుకు ప్రయత్నించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలను పరిశీలించారు. బావిలో నుంచి కారును తీసేందుకు గజఈతగాళ్లు తీవ్రంగా శ్రమించారు. మోటార్ల సాయంతో బావిలోని నీరు కొంత మేర తీసేసిన అనంతరం బావి లోపల ఉన్న కారుకు గజఈతగాడు నర్సింహులు తాడును బిగించాడు. తాడు బిగించిన అనంతరం పైకి వచ్చే క్రమంలో కారుకు చిక్కుకుపోయి నర్సింహులు నీటిలోనే మృతిచెందాడు. మరోవైపు బావిలోకి దూసుకెళ్లిన కారులో నుంచి తల్లీకుమారుడు లక్ష్మీ, ప్రశాంత్ మృతదేహాలను వెలికి తీశారు. మృతులు మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ వాసులుగా గుర్తించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.