Viveka Murder Case: పులివెందులలో రెండో రోజు కొనసాగిన సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 100వ రోజుకు చేరుకుంది. విచారణలో భాగంగా కడప జిల్లా పులివెందులలోని ఆయన నివాసంలో రెండో

Updated : 15 Sep 2021 13:06 IST

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 100వ రోజుకు చేరుకుంది. విచారణలో భాగంగా కడప జిల్లా పులివెందులలోని ఆయన నివాసంలో రెండో రోజు రీ కన్‌స్ట్రక్షన్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో వివేకా ఇంటి పరిసరాలను వీడియో, ఫొటోలు తీసి కొలతలు వేశారు. నిన్న సాయంత్రం ప్రారంభించిన సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ప్రక్రియ కొనసాగింపుగా ఇవాళ కూడా జరిగింది. నలుగురు వ్యక్తులు ఇంట్లోకి ఎలా వచ్చారన్న దానిపై సీబీఐ ఆరా తీస్తోంది.

వివేకా హత్య జరిగిన సమయంలో ఎర్ర గంగిరెడ్డి, సునీల్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి ఇంట్లోకి ప్రవేశించినట్లు సీబీఐ అనుమానిస్తోంది. నలుగురు వ్యక్తుల పేర్లతో స్టిక్కర్లను చొక్కాలకు అంటించుకొని సీబీఐ ట్రయల్స్‌ నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో సునీల్ యాదవ్‌, ఉమా శంకర్‌రెడ్డి అరెస్టు అయిన విషయం తెలిసిందే. మరికొందరు నిందితుల కోసం సీబీఐ అధికారులు ఆరా తీస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని