Viveka Murder Case: సీబీఐ అధికారులను కలిసిన వివేకా కుమార్తె సునీత

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 73వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో సునీల్‌యాదవ్‌ సమీప బంధువు భరత్‌ యాదవ్‌ను అధికారులు

Updated : 18 Aug 2021 12:08 IST

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 73వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో సునీల్‌యాదవ్‌ సమీప బంధువు భరత్‌ యాదవ్‌ను అధికారులు విచారిస్తున్నారు. ఇతడితో పాటు పులివెందుల ప్రాంతానికి చెందిన మహబూబ్‌ బాషా, నాగేంద్రతో సహా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న మరో వ్యక్తి విచారణకు హాజరయ్యారు. ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌, గతంలో వివేకా పొలం పనులు చూసిన సుంకేసుల గ్రామానికి చెందిన జగదీశ్వర్‌రెడ్డిని కూడా సీబీఐ ఇవాళ విచారణకు పిలిచినట్లు సమాచారం. 

పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఎంపీ అవినాష్‌ తండ్రి భాస్కర్‌రెడ్డి, చిన్నాన్న మనోహర్‌రెడ్డి, వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ బృందం ఇవాళ మరోసారి విచారణకు పిలిచింది. మరోవైపు వివేకా కుమార్తె సునీత ఇవాళ కడపలో సీబీఐ అధికారులను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేసు దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలను  ఆమె అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. పులివెందులలో రెండు రోజులు పాటు వైఎస్‌ కుటుంబ సభ్యులను సీబీఐ విచారించింది. ఈ నేపథ్యంలో హత్యకు సంబంధించిన వివరాలు ఏమైనా వెల్లడయ్యాయా?అని తెలుసుకునేందుకు సునీత సీబీఐ అధికారులను కలిసినట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని