Viveka Murder Case: ప్రొద్దుటూరు మెజిస్ట్రేట్‌ ముందుకు కృష్ణమాచార్యులు 

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 92వ రోజు కొనసాగుతోంది.

Updated : 06 Sep 2021 13:30 IST

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 92వ రోజు కొనసాగుతోంది. విచారణలో భాగంగా ఇవాళ అనంతపురం జిల్లా కదిరికి చెందిన కృష్ణమాచార్యులను ప్రొద్దుటూరు కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ మెజిస్ట్రేట్‌ ఎదుట అతడిని హాజరుపరిచారు. ఈ క్రమంలో 164 సెక్షన్‌ కింద వాంగ్మూలం నమోదు చేయనున్నారు. కృష్ణమాచార్యులు కదిరిలో హార్డ్‌వేర్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ పలుమార్లు కృష్ణమాచార్యులను ప్రశ్నించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని