Vivek Murder Case: మూడో రోజు ఉమాశంకర్‌రెడ్డిని ప్రశ్నిస్తోన్న సీబీఐ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో అనుమానితులను

Updated : 19 Sep 2021 14:01 IST

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో అరెస్టైన ఉమా శంకర్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సీబీఐ అధికారులు మూడో రోజు ప్రశ్నిస్తున్నారు. ఆయుధాల గుర్తింపు కోసం అతడిని సుదీర్ఘంగా ప్రశ్నించడంతో పాటు కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. మరో ఇద్దరు అనుమానితులు సీబీఐ విచారణకు హాజరయ్యారు. సింహాద్రిపురం మండలం సుంకేశుల గ్రామానికి చెందిన సోమశేఖర్‌రెడ్డి, పులివెందులకు చెందిన వెంకట్‌నాథ్‌రెడ్డి సీబీఐ విచారణకు వచ్చారు. నాలుగు రోజులు కస్టడీ అనంతరం ఉమా శంకర్‌రెడ్డిని సోమవారం పులివెందుల కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని