Viveka Murder Case: మళ్లీ మొదలైన సీబీఐ విచారణ.. హాజరైన భరత్‌కుమార్‌ యాదవ్‌

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ దాదాపు నెలన్నర తర్వాత మళ్లీ మొదలైంది..

Updated : 15 Dec 2021 13:32 IST

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ దాదాపు నెలన్నర తర్వాత మళ్లీ మొదలైంది. కడపలోని కేంద్ర కారాగారం అతిథి గృహంలో సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. విచారణకు పులివెందులకు చెందిన సునీల్‌ యాదవ్‌ బంధువు భరత్‌ కుమార్‌ యాదవ్‌ హాజరయ్యారు. వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపై భరత్‌కుమార్‌ ఆరోపణలు చేశారు. ఇతడిని సీబీఐ గతంలో చాలా సార్లు ప్రశ్నించినప్పటికీ తాజాగా మరోసారి ప్రశ్నిస్తుండటం గమనార్హం.

వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి.. వివేకా హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ గత నెల 21న భరత్‌కుమార్‌ సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. దీంతో పాటు మీడియా ముందుకు వచ్చి కూడా ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలు తనకు తెలుసని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే భరత్‌కుమార్‌ను సీబీఐ అధికారులు విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని