Crime News: రుణాల పేరుతో మోసం: విజయ ఏరో బ్లాక్స్‌ డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు

రుణాల పేరిట బ్యాంకును మోసం చేశారన్న అభియోగంపై విజయ ఏరో బ్లాక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఫిర్యాదు మేరకు విజయ

Published : 02 Jan 2022 01:25 IST

హైదరాబాద్‌: రుణాల పేరిట బ్యాంకును మోసం చేశారన్న అభియోగంపై విజయ ఏరో బ్లాక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఫిర్యాదు మేరకు విజయ ఏరో బ్లాక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ డైరెక్టర్లు నర్రా ప్రసన్న కుమార్‌, చిగురుపాటి రాంప్రసాద్‌, నర్రా లక్ష్మీప్రసన్న, నర్రా విజయలక్ష్మిపై సీబీఐ కేసు నమోదు చేసింది. విజయ ఏరో బ్లాక్స్‌ పేరిట రుణాలు తీసుకొని ఇతర వ్యాపారాలకు మళ్లించి.. తర్వాత రుణ చెల్లింపులను ఎగవేశారని అభియోగం. అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకు తప్పుడు దస్త్రాలు, లావాదేవీల వివరాలను సమర్పించినట్టు సీబీఐకి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫిర్యాదు చేసింది. డైరెక్టర్ల అక్రమాల వల్ల సుమారు రూ.44 కోట్ల మేర నష్టం జరిగిందని అభియోగం. ఈమేరకు సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని