Crime News: విజయవాడలో చెడ్డీగ్యాంగ్‌ హల్‌చల్‌!

విజయవాడ నగర శివారు ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. గుంటుపల్లి గ్రామంలోని

Published : 03 Dec 2021 01:24 IST

విజయవాడ: విజయవాడ నగర శివారు ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. గుంటుపల్లి గ్రామంలోని ఓ అపార్ట్‌మెంట్లోకి ఐదుగురు సభ్యుల ముఠా ప్రవేశించింది. అర్ధరాత్రి దాటాక 2గంటల సమయంలో కర్రలు, మారణాయుధాలతో చెడ్డీగ్యాంగ్‌ ప్రవేశించడం అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాల్లో నమోదైంది. ఆ సమయంలో అలికిడి రావడంతో ఓ ప్లాట్‌ యజమాని కారిడార్‌లోని లైట్లు వేయడంతో ఆగంతకులు అక్కడి నుంచి పరారయ్యారు.

తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడ్డ ముఠా(చెడ్డీ గ్యాంగ్‌)నే ఇక్కడా చోరీకి విఫలయత్నం చేసిందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు చెడ్డీగ్యాంగ్ పేరు విన్న పరిసర ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయాందోళనతో పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని