డా.చిగురుపాటి జయరాం హత్య కేసు.. రిమాండ్‌ ఖైదీ బరితెగింపు

పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు డా.చిగురుపాటి జయరాం హత్య ఘటనలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న రాకేష్‌రెడ్డి ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు చంచల్‌గూడ జైల్లోంచే బెదిరింపుల పర్వం ప్రారంభించాడు. అతడిపై కన్నేసి ఉంచిన

Updated : 20 Oct 2021 11:14 IST

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌: పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు డా.చిగురుపాటి జయరాం హత్య ఘటనలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న రాకేష్‌రెడ్డి ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు చంచల్‌గూడ జైల్లోంచే బెదిరింపుల పర్వం ప్రారంభించాడు. అతడిపై కన్నేసి ఉంచిన పోలీసులకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు, సాక్షులకు వాట్సప్‌లో బెదిరింపు లేఖలు పంపినట్లు తెలిసింది. అతడికి సహకరించిన అక్బర్‌ అలీ, మంగయ్య గుప్తా, కత్తుల శ్రీనివాస్‌లను మంగళవారం అరెస్ట్‌ చేశారు. కొత్వాల్‌ అంజనీకుమార్‌ విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.

చంచల్‌గూడ జైల్లో పథకం..

‘‘2019, జనవరిలో జూబ్లీహిల్స్‌లో జయరాం హత్య కేసులో ప్రధాన నిందుతుడైన రాకేష్‌రెడ్డి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను, సాక్షులను బెదిరించే పథకం వేశాడు. స్నేహితులు, తరచూ ములాఖత్‌లకు వచ్చే రియల్‌ వ్యాపారి కూరపాటి మంగయ్యగుప్తా, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గుత్తేదారు కత్తుల శ్రీనివాస్‌కు పథకాన్ని వివరించాడు. వారు చంచల్‌గూడ జైల్లో మేల్‌నర్స్‌గా పనిచేస్తున్న బడాబజార్‌ వాసి మహ్మద్‌ అక్బర్‌ అలీని ఎంచుకున్నారు. రూ.5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఒక ఫోన్‌ కొనిచ్చారు. కొందరు ఖైదీలతో రాకేష్‌రెడ్డి ఐదు బెదిరింపు లేఖలు రాయించాడు. ఆ లేఖలను అక్బర్‌.. అతడు చెప్పిన వారికి వాట్సప్‌ చేశాడు. ఇందులో జూబ్లీహిల్స్‌లో నివసించే ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజీవ్‌రెడ్డి, మరో పీపీ సాంబశివరెడ్డి, ముగ్గురు సాక్షులు ఉన్నారు’’ అని కొత్వాల్‌ అంజనీకుమార్‌, సంయుక్త కమిషనర్‌ ఎ.ఆర్‌.శ్రీనివాస్‌ వివరించారు. జైల్లో ఉన్న రాకేష్‌రెడ్డిని కూడా అరెస్టు చేసినట్టేనని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు