AP News: దీపం వదులుతూ కాల్వలో పడిన దంపతుల మృతి

కార్తిక మాస దీప కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కర్నూలులోని కేసీ కాలువలో ప్రమాదవశాత్తు పడిన దంపతులు మృతి చెందారు. కర్నూలులోని అబ్బాస్‌ నగర్‌లో

Updated : 20 Nov 2021 06:47 IST

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: కార్తిక మాస దీప కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కర్నూలులోని కేసీ కాలువలో ప్రమాదవశాత్తు పడిన దంపతులు మృతి చెందారు. కర్నూలులోని అబ్బాస్‌ నగర్‌లో నివాసం ఉండే రాఘవేంద్రప్రసాద్‌(44) టీజీవీ గ్రూప్‌ సంస్థలో పని చేస్తుండేవారు. ఆయనకు భార్య ఇందిర(41), ఇద్దరు కుమారులు. కార్తిక పౌర్ణమి కావడంతో రాఘవేంద్ర ప్రసాద్‌ దంపతులు శుక్రవారం ఉదయం 5 గంటలకు వినాయక్‌ ఘాట్‌ వద్ద కేసీ కాల్వ పక్కనే ఉన్న గుడికి వెళ్లారు. ఇందిర కాలువలో దీపం వదులుతూ అదుపుతప్పి అందులో పడిపోయారు. ఆమెను కాపాడేందుకు వెళ్లి రాఘవేంద్రప్రసాద్‌ కూడా కాల్వలో పడిపోయారు. స్థానికులు గమనించి వీరిని కాపాడేందుకు ప్రయత్నించగా.. ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో ఇద్దరూ అప్పటికే కొట్టుకుపోయారు. ఈ లోపు సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి విస్తృతంగా గాలింపు చేపట్టారు. చివరికి ఘటన స్థలి నుంచి సుమారు 4 కి.మీ దూరంలోని జొహరాపురం వద్ద ఆ దంపతుల మృతదేహాలను గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు