
సెలైన్ స్టాండ్‌తో వైద్యుడిపై కరోనా రోగి దాడి
ముంబయి: కరోనా నుంచి మన ప్రాణాల్ని రక్షించుకొనేందుకు మాస్కు ధరించడమే శ్రీరామరక్ష అంటూ వైద్యులు పదేపదే హెచ్చరిస్తున్నా కొంతమందిలో ఇంకా మార్పు రావడంలేదు. ఒకవేళ ఎవరైనా మాస్క్ తీయొద్దని చెబితే కోపంతో వారిపైనే దాడులకు పాల్పడుతున్న ఘటనలు చూస్తున్నాం. తాజాగా మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ మాస్కు తీయొద్దని చెప్పినందుకు కరోనా రోగి సెలైన్ స్టాండ్‌తో ఓ వైద్యుడిపై దాడి చేయడం కలకలం రేపింది. తీవ్రంగా గాయపడిన వైద్యుడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయగఢ్ జిల్లా అలీబాగ్ ప్రభుత్వ ఆస్పత్రిలోని బుధవారం ఉదయం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. కరోనా బారినపడిన ఓ వ్యక్తి గత నాలుగు రోజులుగా ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం విధుల్లో ఉన్న స్వప్నదీప్ తాలే అనే వైద్యుడు రౌండ్స్‌కు వచ్చిన సమయంలో ఆక్సిజన్ మాస్కును పదే పదే తీయొద్దంటూ రోగికి సూచించారు. వైద్యుడి సూచనలతో రోగి కోపానికి గురైన నిందితుడు కుర్చీలో కూర్చున్న వైద్యుడిపై వెనుక నుంచి వచ్చి సెలైన్ స్టాండ్‌తో తలపై గట్టిగా కొట్టాడు. వైద్యుడికి గాయాలు కావడంతో అదే ఆస్పత్రిలో చేర్పించారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.