Updated : 30/11/2021 16:31 IST

Crime News: వరంగల్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌: ఇద్దరి అరెస్ట్‌.. భారీగా నగదు స్వాధీనం

వరంగల్‌: ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని వరంగల్‌ పోలీసులు పట్టుకున్నారు. హన్మకొండ జిల్లాకు చెందిన మాడిశెట్టి ప్రసాద్‌, మహారాష్ట్రకు చెందిన అభయ్‌ అనే ఇద్దరు బుకీలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.2.05 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరు ముంబయి కేంద్రంగా ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్, పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద ఉన్న వివిధ బ్యాంకులకు చెందిన 43 పాసుపుస్తకాలు, ఏటీఎం కార్డులు, ఏడు సెల్‌ఫోన్లను సీజ్‌ చేసినట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి వివరించారు.

నిందితుడు ప్రసాద్‌ హైదరాబాద్‌లోని హఫీజ్‌పేటలో బట్టల వ్యాపారం నిర్వహించేవాడని పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో 2016 నుంచి క్రికెట్, పేకాట బెట్టింగ్ ప్రారంభించాడని చెప్పారు. ఈ క్రమంలో ముంబయి కేంద్రంగా ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ నిర్వహించే మరో నిందితుడు అభయ్‌తో ప్రసాద్‌కు పరిచయం ఏర్పడినట్లు తెలిపారు. బెట్టింగ్‌ పెట్టిన వారిని ముందుగా గెలిపించి.. వారితో ఎక్కువ మొత్తంలో డబ్బు పందెం కాసేలా చేసి ఓడిపోయేలా నిందితులు చేసేవారని పోలీసులు వెల్లడించారు.


Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని