Published : 03/09/2021 17:36 IST

Gold Smuggling: నిన్న అరకిలో.. ఇవాళ కిలో బంగారం స్వాధీనం

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇవాళ కూడా అక్రమ బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న దాదాపు అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు ఇవాళ కిలో బంగారం పట్టుకున్నారు. షార్జా నుంచి ఓ ప్రయాణికుడు అక్రమంగా బంగారం తీసుకొస్తున్నట్టు అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అతన్ని అదుపులోకి తీసుకుని లగేజీ తనిఖీ చేయగా.. పేస్టు రూపంలో ఉన్న కిలో బంగారం బయటపడింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.43.55లక్షలు ఉంటుందని అధికారులు అంచనావేశారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని