Hyderabad News: బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 1.20 కోట్లు మాయం

పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సైబర్‌ నేరగాళ్ల వలలో పడుతున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా హైదరాబాద్‌కు..

Published : 20 Aug 2021 01:41 IST

హైదరాబాద్: పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సైబర్‌ నేరగాళ్ల వలలో పడుతున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ బ్యాంకు ఖాతా నుంచి రూ.1.20 కోట్లు సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఖైరతాబాద్‌కి చెందిన నలుగురు కుటుంబసభ్యులకు బ్యాంక్‌లో జాయింట్ అకౌంట్ ఉంది. అనారోగ్య కారణాలతో వారిలో ముగ్గురు చనిపోయారు. జాయింట్ అకౌంట్‌లో ఉన్న రూ.2 కోట్లను విత్‌ డ్రా చేసేందుకు ఆ కుటుంబంలోని మహిళ ప్రయత్నించారు. ఇంతలోనే రూ.1.20 కోట్లు ఖాతా నుంచి ఉపసంహరించినట్లు మహిళ తండ్రి ఫోన్‌కు సందేశం వచ్చింది. కంగుతిన్న మహిళ బ్యాంకు అధికారులను అడిగినా ప్రయోజనం లేకపోవడంతో.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని