
Sherlyn Chopra: షెర్లిన్ చోప్రాపై రూ. 50 కోట్ల పరువు నష్టం దావా
ముంబయి: మోడల్, నటి షెర్లిన్ చోప్రాపై శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా దంపతుల తరఫు న్యాయవాదులు రూ. 50 కోట్ల పరువు నష్టం దావా వేశారు. రాజ్‌కుంద్రాపై షెర్లీ చేసిన ఆరోపణలు నిరాధారమని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే రాజ్‌కుంద్రాపై కేసు పెట్టిన షెర్లిన్ లైంగికంగా, మానసికంగా తనని వేధిస్తున్నాడంటూ ఇటీవల మరోసారి ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయించింది. తాజాగా ఈ కేసు విషయమై రాజ్‌కుంద్రా దంపతుల తరఫు న్యాయవాదులు షెర్లిన్‌పై రూ. 50 కోట్ల పరువు నష్టం దావా వేశారు. రాజ్‌కుంద్రాపై ఆమె చేసిన ఆరోపణలు నిరాధారమని, వాటిల్లో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ అవాస్తవమని, నిరూపించేందుకు ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. వివాదాలు సృష్టించేందుకు, మీడియాని ఆకర్షించేందుకు ఇలా చేసిందంటూ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. అశ్లీల చిత్రాలు తెరకెక్కిస్తున్నారనే కారణంగా రాజ్‌కుంద్రా అరెస్టయిన సంగతి తెలిసిందే.