Saidabad: సైదాబాద్‌ నిందితుడు రాజు గురించి సంబంధీకులు తెలిపిన వివరాలివే..

హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనలో నిందితుడు పల్లకొండ రాజు కోసం పోలీసులు అతడి అత్తగారి ఊరు సూర్యాపేట జిల్లా జలాల్‌పురం సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో బుధవారం గాలింపు చేపట్టారు. అతని సంబంధీకులను

Updated : 16 Sep 2021 07:05 IST

తిరుమలగిరి, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనలో నిందితుడు పల్లకొండ రాజు కోసం పోలీసులు అతడి అత్తగారి ఊరు సూర్యాపేట జిల్లా జలాల్‌పురం సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో బుధవారం గాలింపు చేపట్టారు. అతని సంబంధీకులను ఆరా తీశారు. రాజు భార్య ప్రసవం కోసం ఏడాది క్రితం పుట్టింటికి వచ్చి, ఇక్కడే ఉంటున్నట్టు తెలుసుకున్నారు. అతను అప్పుడప్పుడు వచ్చేవాడని, రెండు వారాల క్రితం జలాల్‌పురానికి వచ్చి కూలి పనులు చేశాడని సంబంధీకులు, స్థానికులు తెలిపారు. ఒకరోజు తాగిన మైకంలో అత్తపై చేయిచేసుకున్నాడని, కుటుంబ సభ్యులు దాడి చేస్తారని భయంతో మళ్లీ హైదరాబాద్‌కు పారిపోయాడని వివరించారు.


సత్వరమే శిక్ష పడేలా చూస్తాం: హోంమంత్రి

ఈనాడు, హైదరాబాద్‌: హత్యాచార ఘటన నిందితుడికి త్వరగా పట్టుకుని, సత్వరమే శిక్ష పడేలా చూస్తామని హోంమంత్రి మహమూద్‌ అలీ వెల్లడించారు. బుధవారం డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌, ఇతర అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. నిందితుడి ఫొటో, రూ.10 లక్షల రివార్డు గురించి విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారని, బాధిత చిన్నారి కుటుంబానికి సానుభూతి తెలిపారని హోంమంత్రి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని