
Updated : 02 Dec 2021 10:47 IST
Crime News: కుమారుడిని కరిచిందని.. కుక్కను చంపేశాడు
మధ్యప్రదేశ్లో అమానవీయ ఘటన వెలుగు చూసింది. మూగజీవి పట్ల ఓ వ్యక్తి కర్కశంగా ప్రవర్తించాడు. తన కుమారుడిని కరిచిందన్న కోపంతో ఓ వ్యక్తి అతి దారుణంగా శునకం ప్రాణాలు తీశాడు. గ్వాలియర్ జిల్లా సిమారియాతల్ గ్రామంలో ఇటీవల ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆ వీడియోలో నిందితుడు... శునకాన్ని చితకబాదుతున్నట్లుగా కనిపించింది. అది నొప్పితో విలవిలలాడుతున్న క్రమంలో దాని కాలిని పదునైన ఓ కత్తితో కోయడం కనిపించింది. అతనిపై చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థ పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్(పెటా) కార్యకర్తలు డిమాండ్ చేశారు. పెటా కార్యకర్త ఛాయా తోమర్ ఫిర్యాదుతో నిందితునిపై పోలీసులు కేసు నమోదు చేశారని ఎస్పీ అమిత్ సంఘీ తెలిపారు.
Tags :