
Fake challans case: భారీ మోసాలు జరిగినట్లు గుర్తించాం: రజత్ భార్గవ్
గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసిన నకిలీ చలాన్ల కుంభకోణంపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ వెల్లడించారు. ఈ కుంభకోణానికి సంబంధించి మొత్తంగా 65 లక్షల డాక్యుమెంట్లను పరిశీలించినట్లు చెప్పారు. ఈ నకిలీ చలాన్ల ద్వారా మొత్తం రూ.5 కోట్ల మేర నష్టం జరిగిందన్నారు. ఈ అవినీతికి సంబంధించి రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ఇప్పటికే 10 క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలిపారు. వాటిలో కృష్ణా, కడప జిల్లాల్లోనే అధికంగా ఉన్నాయన్నారు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేయగా.. రూ.1.37 కోట్లు రికవరీ చేసినట్లు రజత్ భార్గవ్ తెలిపారు. మొత్తం పది మందిపై ఆరోపణలు ఉన్నాయని.. 770 డాక్యుమెంట్లలో భారీ మోసాలు జరిగినట్లు గుర్తించామన్నారు. కృష్ణా జిల్లా మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెద్ద ఎత్తున మోసాలు జరిగాయన్నారు. చలాన్లు కట్టారో.. లేదో.. విచారణలో తేలుతుందన్నారు. కొనుగోలుదారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి సీఐడీ విచారణ అవసరం లేదని.. పోలీసు కేసు సరిపోతుందని వెల్లడించారు. కౌన్సెలింగ్ ద్వారానే సబ్ రిజిస్ట్రార్ల పదోన్నతులు కల్పించామని.. ప్రమోషన్లు తీసుకోబోమనే విధానానికి స్వస్తి పలికినట్లు భార్గవ్ వివరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.