Published : 04/12/2021 01:22 IST

Crime News: కరెంటు షాకిచ్చి చిన్నారిని హతమార్చిన కసాయి తండ్రి

తొగుట: సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తలు ఘర్షణపడి 11 నెలల చిన్నారిని విద్యుత్‌ షాక్‌ పెట్టి హతమార్చిన ఘటన స్థానికులను కలచివేసింది. వెంకట్రావుపేటకు చెందిన మిరుదొడ్డి రాజశేఖర్‌..  దౌల్తాబాద్‌ మండల కేంద్రానికి చెందిన సునీతను రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. కొంత కాలం కాపురం సజావుగానే సాగింది. 11 నెలల క్రితం పాప జన్మించిన తర్వాత సునీత, రాజశేఖర్‌ తరచూ గొడవపడేవారు. ఈక్రమంలో ఇరు గ్రామాలకు చెందిన పెద్దలు పలు మార్లు పంచాయితీ  పెట్టి కలిసుండాలని నచ్చజెప్పారు.

 సునీత, అత్తమామలకు మధ్య గొడవకు దారితీసే అవకాశం ఉంటే వేరు కాపురం పెట్టాలని పెద్దలు సూచించారు. ఈనేపథ్యంలో వేరు కాపురం పెడతామని సునీత కోరగా.. రాజశేఖర్ నిరాకరించడంతో గొడవలు మళ్లీ మొదలయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం మరోసారి గొడవ జరగడంతో భార్య సునీతను కొట్టి పాపను వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి విద్యుత్‌ షాకిచ్చి చంపేశాడు. పాప మృతి చెందిన తర్వాత రాజశేఖర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. హుటాహుటిన అతడిని కుటుంబ సభ్యులు గజ్వే్‌ల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని