Ludo Game: లూడో గేమ్‌ విషయంలో ఘర్షణ.. పాతబస్తీలో యువకుడి మృతి

లూడో గేమ్‌ విషయంలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి మృతికి దారితీసింది.

Updated : 21 Sep 2021 21:59 IST

హైదరాబాద్‌: లూడో గేమ్‌ విషయంలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి మృతికి దారితీసింది. ఈ ఘటన పాతబస్తీలోని మంగళ్‌హాట్‌ పరిధి గుఫ్ఫానగర్‌లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. లూడో గేమ్‌ ఆడిన హనీఫ్‌, హాజీ అనే ఇద్దరు యువకులు.. డబ్బు విషయలో ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో హనీఫ్ అక్కడికక్కడే మృతిచెందగా.. హాజీకి తీవ్రగాయాలయ్యాయి. హాజీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మంగళ్‌హాట్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని