Hyderabad News: కేపీహెచ్బీలోని శివపార్వతి థియేటర్లో అగ్నిప్రమాదం
నగరంలోని కూకట్పల్లిలో అగ్నిప్రమాదం సంభవించింది. కేపీహెచ్బీ కాలనీలోని శివపార్వతి థియేటర్లో ఆదివారం అర్ధరాత్రి దాటాక మంటలు చెలరేగాయి.
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో అగ్నిప్రమాదం సంభవించింది. కేపీహెచ్బీ కాలనీలోని శివపార్వతి థియేటర్లో ఆదివారం అర్ధరాత్రి దాటాక మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో థియేటర్లోని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. అగ్నికీలల ధాటికి థియేటర్ పైకప్పు కూలిపోయింది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. థియేటర్లో మంటలు గమనించిన సెక్యూరిటీ గార్డు అగ్నిమాపకశాఖకు సమాచారం అందించాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న సిబ్బంది మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మూడు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్