హైదరాబాద్‌లో కాల్పుల కలకలం

గన్‌ఫౌండ్రీలోని ఎస్‌బీఐ కార్యాలయం ఆవరణలో కాల్పుల ఘటన కలకలం రేపింది.  ఓ సెక్యూరిటీ గార్డు జరిపిన కాల్పుల్లో ఒప్పంద ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి

Published : 15 Jul 2021 01:27 IST

హైదరాబాద్‌: గన్‌ఫౌండ్రీలోని ఎస్‌బీఐ కార్యాలయం ఆవరణలో కాల్పుల ఘటన కలకలం రేపింది. బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సర్దార్‌ఖాన్‌ జరిపిన కాల్పుల్లో ఒప్పంద ఉద్యోగి సురేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది గాయపడిన ఉద్యోగిని ఆసుపత్రికి  తరలించారు. ఇద్దరి మధ్య పరస్పర వాగ్వాదంతో విచక్షణ కోల్పోయిన సెక్యూరిటీ గార్డు సర్దార్‌ ఖాన్‌ రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సర్దార్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

గాయపడిన ఒప్పంద ఉద్యోగి సురేందర్‌ ప్రస్తుతం హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పక్కటెముకల్లో బుల్లెట్లు దిగాయని, అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. సర్దార్‌ ఖాన్‌ గత 20 ఏళ్లుగా అబిడ్స్‌లోని ఎబీఐ ప్రధాన కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్టు సిబ్బంది తెలిపారు. సురేందర్‌, సర్దార్‌ఖాన్‌ ఇద్దరూ స్నేహంగా ఉండేవారని, ఘటనకు ఆర్థిక లావాదేవీలే కారణమై ఉండొచ్చని భావిస్తున్నట్టు చెప్పారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని