Crime News: అరకు TO ముంబయి వయా హైదరాబాద్‌... రైళ్లలో భారీగా గంజాయి తరలింపు

గంజాయి విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్‌ నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.67లక్షల విలువ చేసే 336 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Published : 10 Dec 2021 01:34 IST

హైదరాబాద్‌: గంజాయి విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్‌ నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.67లక్షల విలువ చేసే 336 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలకు భారీ మొత్తంలో గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. విశాఖ నుంచి ముంబయి వెళ్లే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో  లింగంపల్లిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో ఏసీ బోగీలో ప్రయాణిస్తున్న ఏడుగురు మహిళలు, ఏడుగురు పురుషులు అక్రమంగా గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు.  24 లగేజీ బ్యాగులలో అక్రమంగా తరలిస్తున్న రూ.67లక్షల విలువ చేసే 336 కేజీల గంజాయిని పోలీసులు సీజ్‌ చేశారు. అరకు నుంచి గంజాయి ముంబయి తరలిస్తున్నట్టు గుర్తించారు. అరకు సమీపంలో ఉన్న గ్రామాల్లో గంజాయి పండించే వారి వద్ద  నుంచి ఈముఠా గంజాయి కొనుగోలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ముఠాలోని మహిళలు పోలీసులకు అనుమానం రాకుండా ప్రయాణికుల ముసుగులో వ్యాపారం చేస్తున్నట్టు పేర్కొన్నారు. పసిపిల్లలను వెంటబెట్టుకొని విశాఖ, అరకు నుంచి గంజాయి తరలింపు భారీగా జరుగుతోందని, విశాఖ నుంచి వచ్చే రైళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హైదరాబాద్‌ అర్బన్‌ రైల్వే డీఎస్పీ చంద్రబాను తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు