
AP News: విశాఖ పరవాడ ఫార్మాసిటీలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికుల మృతి
పరవాడ: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం చోటు చేసుకుంది. విష వాయువు లీకై ఇద్దరు ఒప్పంద కార్మికులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పాయకరావుపేటకు చెందిన మణికంఠ (22), తుని సమీపంలోని సీతారామపురానికి చెందిన దుర్గాప్రసాద్ (21) పరవాడ ఫార్మాసిటీలో ఒప్పంద కార్మికులుగా పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి వీరిద్దరూ విధులకు హాజరయ్యారు. విధుల్లో భాగంగా ఫార్మాసిటీలోని వ్యర్థజలాల పంప్ హౌస్ వద్ద వాల్వ్ తిప్పుతుండగా విషవాయువు లీకైంది.
ఈ ఘటనలో కార్మికులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పరవాడ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.