AP News: వంతెనను ఢీకొట్టిన గ్యాస్‌ లారీ.. చెల్లాచెదురుగా పడిపోయిన సిలిండర్లు

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కనిగిరి మండలం బల్లిపల్లి సమీపంలో ఇండేన్‌ గ్యాస్‌ సిలిండర్లను తరలిస్తున్న లారీ....

Updated : 15 Dec 2021 11:53 IST

కనిగిరి: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కనిగిరి మండలం బల్లిపల్లి సమీపంలో ఇండేన్‌ గ్యాస్‌ సిలిండర్లను తరలిస్తున్న లారీ.. వంతెన రక్షణ గోడను ఢీకొట్టింది. కనిగిరి-పామూరు ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. వంతెనను లారీ ఢీకొట్టడంతో అందులో ఉన్న గ్యాస్‌ సిలిండర్లన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. గ్యాస్‌తో ఉన్న సిలిండర్లు అక్కడ పడిపోవడంతో స్థానికులు భయాందోళనలు గురవుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని