
Crime News: విశాఖలో అదృశ్యమైన బాలిక అనుమానాస్పద మృతి
విశాఖ: విశాఖలోని అగనంపూడిలో బాలిక అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. శనివాడలోని ఓ అపార్ట్మెంట్ వద్ద మంగళవారం రాత్రి 9 గంటలకు బాలిక అదృశ్యమైంది. బాలిక కోసం కుటుంబీకులు, స్థానికులు వెతుకుతుండగా అపార్ట్మెంట్ వద్దే మృతదేహాన్ని గుర్తించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం బైరెడ్డి పేటకు చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం విశాఖకు వచ్చింది. అగనంపూడిలో ఓ అపార్ట్మెంట్లో పనికి చేరింది. వారి 13ఏళ్ల కుమార్తె నిన్న రాత్రి నుంచి అదృశ్యమై చివరికి విగతజీవిగా కనిపించింది. ఎవరో హత్య చేసి పడేసినట్లుగా భావిస్తున్న తల్లిదండ్రులు కూర్మన్నపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మృతదేహంతో ఆందోళన చేపట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.