Crime News: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మహిళల నుంచి విదేశీ కరెన్సీ, బంగారం స్వాధీనం

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో వేర్వేరు ఘటనల్లో కస్టమ్స్‌ అధికారులు ముగ్గురు మహిళా ప్రయాణికులపై మూడు కేసులు నమోదు చేశారు. వారి నుంచి రూ.29 లక్షలకుపైగా విలువైన విదేశీ కరెన్సీ, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. శంషాబాద్‌ విమానాశ్రయానిక...

Updated : 13 Sep 2023 14:57 IST

హైదరాబాద్: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో వేర్వేరు ఘటనల్లో కస్టమ్స్‌ అధికారులు ముగ్గురు మహిళా ప్రయాణికులపై మూడు కేసులు నమోదు చేశారు. వారి నుంచి రూ.29 లక్షలకుపైగా విలువైన విదేశీ కరెన్సీ, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు మహిళల నుంచి రూ.11.49 లక్షలు విలువ చేసే యుఏఈ కరెన్సీ‌, యుఎస్‌ డాలర్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. వీరిద్దరిపై అక్రమ విదేశీ కరెన్సీని తరలిస్తున్నారనే అభియోగాలపై కేసులు నమోదు చేశారు. అలాగే దుబాయ్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు వచ్చిన మరో మహిళా ప్రయాణికురాలి నుంచి రూ.17.69 లక్షలు విలువ చేసే మూడు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని