Published : 05/10/2021 20:46 IST

Crime News: హ్యాండ్ బ్యాగ్‌, లో దుస్తుల్లో బంగారం.. శంషాబాద్‌లో మహిళ అరెస్టు

హైదరాబాద్: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న కిలోకుపైగా బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సూడాన్‌ నుంచి దుబాయ్‌ మీదుగా హైదారబాద్‌ వచ్చిన మహిళను కస్టమ్స్‌ అధికారులు అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. ఆమె లగేజీ, హ్యాండ్‌ బ్యాగ్‌ సహా పూర్తిగా తనిఖీ చేశారు. లో దుస్తులు, హ్యాండ్‌ బ్యాగ్‌లో నల్లటి ఉండల్లో బంగారాన్ని దాచుకొని తీసుకొచ్చినట్లు కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. దాదాపు 1.209 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు.. దాని విలువ రూ.58.16 లక్షలు ఉంటుందని తెలిపారు. మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శంషాబాద్‌ విమానాశ్రయం కస్టమ్స్‌ డిప్యూటీ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని