Gold Smuggling: బంగారం స్మగ్లింగ్ కేసు.. రూ.25 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్‌

బంగారం స్మగ్లింగ్ కేసులో హైదరాబాద్‌కు చెందిన నగల వ్యాపారి కుటుంబానికి చెందిన రూ.25 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెర్టరేట్‌ (ఈడీ) అటాచ్ చేసింది. ..

Published : 02 Sep 2021 01:18 IST

హైదరాబాద్‌: బంగారం స్మగ్లింగ్ కేసులో హైదరాబాద్‌కు చెందిన నగల వ్యాపారి కుటుంబానికి చెందిన రూ.25 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెర్టరేట్‌ (ఈడీ) అటాచ్ చేసింది. సంజయ్ అగర్వాల్, రాధిక అగర్వాల్, ప్రీతం కుమార్ అగర్వాల్‌కు చెందిన విల్లాలు, 54 కిలోల బంగారాన్ని కోల్‌కతా ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. కోల్‌కతా డీఆర్ఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు విచారణ జరిపారు. గతంలోనే ప్రీతం కుమార్ అగర్వాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. విదేశాలకు ఎగుమతి పేరుతో ఎంఎంటీఏసీ, ఎస్‌టీసీ, డైమండ్ ఇండియా తదితర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డ్యూటీ ఫ్రీ బంగారం కొనుగోలు చేసి.. అక్రమంగా దేశీయంగా వ్యాపారం చేసినట్లు అభియోగాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు