
Crime News: కదిరిలో దొంగల బీభత్సం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలి హత్య
కదిరి పట్టణం: అనంతపురం జిల్లా కదిరిలో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉషారాణి (45) ఇంట్లో దొంగతనానికి వెళ్లిన దుండగులు ఆమెను దారుణంగా హతమార్చారు. అంతకుముందు ఆ పక్కింటిలోనూ చోరీ చేసే క్రమంలో ఆ ఇంట్లో ఉన్న శివమ్మ అనే మహిళను తీవ్రంగా గాయపరిచారు.శివమ్మ ఇంటి పనిమనిషి ఉదయం వచ్చి చూసే వరకు ఈ విషయం బయటకు రాలేదు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శివశంకర్‌రెడ్డి, ఉషారాణి భార్యాభర్తలు. వీళ్లిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం శివశంకర్‌రెడ్డి ఉదయపు నడకకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఉషపై దాడి చేసి చంపేశారు. అనంతరం ఆమె మెడలోని బంగారం లాక్కెళ్లారు. అంతకుముందు ఆ పక్కింటిలో దొంగతానికి వెళ్లిన దుండగులు.. ఆ ఇంట్లో ఉన్న శివమ్మ అనే మహిళను తీవ్రంగా గాయపరిచి ఆమె మెడలోని బంగారాన్ని దోచుకెళ్లారు. తొలుత ఆమె కుమారుడు, కోడలు ఉండే గదికి దొంగలు తాళం వేసి అనంతరం శివమ్మపై దాడి చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో బెంగళూరు తరలించారు.