Updated : 23 Oct 2021 11:16 IST

Crime News: తాత, మనవడి అనుమానాస్పద మృతి

దెందులూరు: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం అలుగుల గూడెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కమ్ముల నంబుద్రిపాల్‌(65), కమ్ముల అద్విక్‌(6) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బంధువులు తెలిపిన వివరాలు మేరకు.. శుక్రవారం అర్ధరాత్రి నంబుద్రిపాల్‌ ఛాతీ నొప్పితో బాధపడ్డారు. అదే సమయంలో అద్విక్‌ కూడా కడుపులో నొప్పితో ఇబ్బంది పడ్డాడు. అనంతరం వారు అపస్మార స్థితిలోకి వెళ్లడంతో స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి అంబులెన్స్‌లో ఏలూరుకు తరలించారు.

ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు నంబుద్రిపాల్‌ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అద్విక్‌ను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో తిరిగి ప్రభుత్వ ఆస్పత్రికే తీసుకొచ్చారు. అప్పటికి బాలుడూ చనిపోయాడు. మృతులను ఆస్పత్రికి తరలించిన కొద్ది సమయం తర్వాత కుటుంబ సభ్యులు ఇంటి వద్ద పామును గుర్తించారు. పాము కాటు వల్లే ఇద్దరూ మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. ఓకే ఇంట్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని