Crime News: అతిథి అధ్యాపకుడి బలవన్మరణం

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఓ అతిథి అధ్యాపకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెల్దండ మండలం బొల్లంపల్లికి చెందిన కాసోజి గణేశ్‌చారి(29) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 2019-2020....

Updated : 12 Sep 2021 10:25 IST

వెల్దండ గ్రామీణం, న్యూస్‌టుడే: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఓ అతిథి అధ్యాపకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెల్దండ మండలం బొల్లంపల్లికి చెందిన కాసోజి గణేశ్‌చారి(29) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 2019-2020 విద్యా సంవత్సరం వరకు వృక్షశాస్త్ర అతిథి అధ్యాపకుడిగా పనిచేసేవారు. తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడంతో ఇంటి వద్దే ఉంటున్నారు. 20 రోజుల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. శనివారం సాయంత్రం పొలం వద్ద ఉన్న తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి మాట్లాడారు. తర్వాత ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గణేశ్‌చారి ఆత్మహత్యకు తిరిగి విధుల్లో చేర్చుకోకపోవటం, ఆర్థిక ఇబ్బందులే కారణమని అతిథి అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి సదానందంగౌడ్‌ ఆరోపించారు. ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశ్‌చంద్‌రెడ్డి మాట్లాడుతూ ఇది రాష్ట్ర ప్రభుత్వ హత్యేనని విమర్శించారు. అతిథి అధ్యాపకులను మళ్లీ విధుల్లోకి తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. ఈ విషయమై వెల్దండ ఎస్సై నర్సింహులును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా తమకు ఇప్పటివరకు ఫిర్యాదు అందలేదని తెలిపారు. వెల్దండ కళాశాల ప్రిన్సిపల్‌ సంజీవరెడ్డిని సంప్రదించగా గణేశ్‌చారికి 2020 ఫిబ్రవరి, మార్చి నెలల వేతనం బకాయి ఉందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని