AP News: పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలో ఉద్రిక్తత.. పలువురికి గాయాలు

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాఠశాల విద్యాకమిటీ ఎన్నికలో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొనగా..

Updated : 06 Oct 2021 15:36 IST

ఏలేశ్వరం: తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాఠశాల విద్యాకమిటీ ఎన్నికలో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. పాఠశాల ప్రాంగణంలోనికి తెదేపా, వైకాపా నాయకులు, కార్యకర్తలు ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నం ఘర్షణకు దారితీసింది. ‘మా వర్గానికి సంబంధించిన తల్లిదండ్రులను ఎన్నికల్లో పాల్గొనేందుకు పాఠశాలలోకి పంపడం లేదు’ అంటూ తెదేపా, వైకాపా నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు ఒకచోట గుమిగూడటంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన కారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొందరు స్థానికులు, పోలీసులు కిందపడిపోయి గాయాలపాలయ్యారు. వివాదం తారస్థాయికి చేరడంతో తిరుమాలి గ్రామంలోని రెండు పాఠశాలల్లో జరుగుతున్న ఎన్నికలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని