Hyderabad News: మాజీ డీఎస్పీ జగన్‌ ఇంట్లో కొనసాగుతున్న అ.ని.శా సోదాలు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన హెచ్‌ఎండీఏ మాజీ డీఎస్పీ జగన్‌ ఇంట్లో 14 గంటలుగా అవినీతి నిరోధక శాఖ(అ.ని.శా) సోదాలు కొనసాగుతున్నాయి.

Updated : 15 Dec 2021 10:36 IST

హైదరాబాద్‌: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన హెచ్‌ఎండీఏ విజిలెన్స్‌ మాజీ డీఎస్పీ జగన్‌ ఇంట్లో 14 గంటలుగా అవినీతి నిరోధక శాఖ(అ.ని.శా) సోదాలు కొనసాగుతున్నాయి. జగన్‌తో పాటు సెక్యూరిటీ గార్డు రామును కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు స్వాధీనం చేసుకున్న కీలక డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ జరుపుతున్నారు.

హెచ్‌ఎండీఏలో పని చేస్తున్న సమయంలో అక్రమాలు చేసినట్లు జగన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జగన్‌తో పాటు అతని బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. బోడుప్పల్‌, కొర్రెముల, జోడిమెట్లలో జగన్‌ వెంచర్‌ వేసినట్లు.. బినామీ పేరుతో పెట్రోల్‌ బంకు నిర్వహిస్తున్నట్లు అ.ని.శా అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని