గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటన.. విచారణకు హోం మంత్రి ఆదేశాలు

గాంధీ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ రోగికి సహాయకులుగా ఉండేందుకు వచ్చిన అక్కాచెల్లెళ్లను అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న రేడియోగ్రాఫర్‌,..

Published : 18 Aug 2021 01:41 IST

హైదరాబాద్‌: గాంధీ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ రోగికి సహాయకులుగా ఉండేందుకు వచ్చిన అక్కాచెల్లెళ్లను అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న రేడియోగ్రాఫర్‌, అతడి స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌, హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌తో కలిసి ఆస్పత్రి ఘటనపై  మహమూద్‌ అలీ సమీక్షించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత శాఖ అధికారులకు హోం మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావును మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ఆస్పత్రి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అత్యాచార ఘటనకు సంబంధించి చిలకలగూడ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉమామహేశ్వర్‌తో పాటు మరో ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని విచారిస్తున్నారు. దీంతో పాటు బాధిత మహిళ కనిపించిన స్థలంలో క్లూస్‌ బృందం ఆధారాలు సేకరించింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి సోదరి కనిపించకపోవడంతో ఆమె కోసం పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైరపర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి స్పందిస్తూ.. బాధితురాళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుదన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు