Crime News: హైదరాబాద్‌లో స్వలింగ సంపర్కుల రేవ్‌ పార్టీ

హైదరాబాద్‌లో జనావాసాల మధ్య ఉన్న ఓ ఇంట్లో శనివారం అర్ధరాత్రి దాటాక ‘రేవ్‌ పార్టీ’ అలజడి చోటుచేసుకుంది. 42 మంది స్వలింగ సంపర్కులపై న్యూసెన్స్‌ కేసు నమోదుచేసిన పోలీసులు.. ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. కూకట్‌పల్లి సీఐ టి.నర్సింగ్‌రావు, స్థానికుల వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి వివేక్‌నగర్‌లోని ఓ ఇంట్లో రేవ్‌ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. మాదాపూర్‌ ఎస్‌ఓటీ, కూకట్‌పల్లి పోలీసులు శనివారం అర్ధరాత్రి దాటాక

Published : 29 Nov 2021 07:42 IST

అర్ధరాత్రి దాటాక అలజడి.. 42 మందిపై కేసు
ఇద్దరు నిర్వాహకుల అరెస్టు.. పరారీలో యజమాని

మూసాపేట, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లో జనావాసాల మధ్య ఉన్న ఓ ఇంట్లో శనివారం అర్ధరాత్రి దాటాక ‘రేవ్‌ పార్టీ’ అలజడి చోటుచేసుకుంది. 42 మంది స్వలింగ సంపర్కులపై న్యూసెన్స్‌ కేసు నమోదుచేసిన పోలీసులు.. ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. కూకట్‌పల్లి సీఐ టి.నర్సింగ్‌రావు, స్థానికుల వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి వివేక్‌నగర్‌లోని ఓ ఇంట్లో రేవ్‌ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. మాదాపూర్‌ ఎస్‌ఓటీ, కూకట్‌పల్లి పోలీసులు శనివారం అర్ధరాత్రి దాటాక మూడు అంతస్తుల ఆ ఇంటిపై దాడులు నిర్వహించారు. ఆ సమయంలో భారీ శబ్ధంతో పాటలు, విద్యుద్దీపాల కాంతుల మధ్య అనేక మంది యువకులు నృత్యాలు చేస్తుండటాన్ని పోలీసులు గమనించారు. కొందరు మద్యం, హుక్కా తాగుతూ కనిపించారు. వారిలో ఇద్దరు హిజ్రాలు, మిగతా వారు స్వలింగ సంపర్కులే. అనుమతి లేకుండా ఎక్కువ మంది గుమిగూడేలా చేయడంతోపాటు అక్రమంగా మద్యం, హుక్కాను సరఫరా చేసినందుకుగాను నిర్వాహకులు, హిజ్రాలైన దయాల్‌(35), ఇమ్రాన్‌(28)లను పోలీసులు అరెస్టు చేశారు. భారీ శబ్దాలతో అసౌకర్యం కలిగించినందుకు 42 మంది స్వలింగ సంపర్కులపై న్యూసెన్స్‌ కేసు నమోదు చేశారు. మద్యం సీసాలు, హుక్కా, కండోమ్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేంద్రం యజమాని రాకేష్‌రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  

మసాజ్‌ కేంద్రంలో ప్రతీవారం ఇదే తంతు..

ఆ ఇంట్లో ఏడాది కాలంగా స్వలింగ సంపర్కులు ప్రతీవారం రేవ్‌ పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రాకేష్‌రెడ్డి అనే వ్యక్తి ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఒడిశాకు చెందిన దయాల్‌ను ఆ కేంద్రానికి ఇన్‌ఛార్జిగా నియమించి సాధారణ రోజుల్లో మసాజ్‌ కేంద్రాన్ని నడుపుతూ శనివారాల్లో స్వలింగ సంపర్కుల కోసమే రేవ్‌ పార్టీ ఏర్పాటు చేస్తున్నాడు. మద్యం, హుక్కా, ఆహారపదార్థాలను నిర్వాహకులే సరఫరా చేస్తారు. ప్రత్యేక యాప్‌ ద్వారా వీరంతా అక్కడ కలుసుకునేలా ఏర్పాట్లు చేశారని దర్యాప్తులో వెల్లడైంది. పార్టీకి వచ్చేవారి నుంచి రూ.300 చొప్పున ప్రవేశ రుసుం తీసుకుంటున్నారు. ఈ సారి ఎక్కువ సంఖ్యలో జనం రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గుట్టురట్టయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని