
Updated : 01 Sep 2021 04:38 IST
Crime news: కామారెడ్డిలో వివాహిత గొంతు కోసిన ఘటనలో మలుపు
కామారెడ్డి: కామారెడ్డి మున్సిపాలిటీలోని బర్కత్ పురలో వివాహితపై హత్యయత్నం ఘటన మలుపు తిరిగింది. తొలుత వివాహిత పని చేసుకుంటున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆమె గొంతు కోశాడని ప్రచారం జరిగింది. అయితే, కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు వివాహితపై దాడి జరగలేదని నిర్ధరించారు. తానే గొంతు కోసుకొని.. హత్యాయత్నం జరిగినట్లు నమ్మించిందని గుర్తించారు. ఆమెకు తొమ్మిది నెలల కిందట కామారెడ్డికి చెందిన యువకుడితో పెళ్లి జరిగిందని.. గతంలో ప్రేమ వ్యవహారమే ప్రస్తుత ఘటనకు కారణమని అనుమానిస్తున్నారు. రెండు నెలల క్రితం కూడా ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. ఘటన అనంతరం యువతిని స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇవీ చదవండి
Tags :