Crime News: డ్రగ్స్‌ వాడుతున్నవారి జాబితా సేకరిస్తున్నాం: సీపీ సీవీ ఆనంద్‌

నగరానికి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న మూడు ముఠాల్లోని ఏడుగురిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు.

Published : 07 Jan 2022 01:34 IST

హైదరాబాద్: నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న మూడు ముఠాల్లోని ఏడుగురిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. వారి నుంచి 99 గ్రాముల కొకైన్, 45గ్రాముల ఎండీఎంఏ, 17 ఎల్‌ఎస్డీఈ, 27ఎక్స్‌టసీ టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నైజీరియాకు చెందిన ప్రధాన నిందితుడు టోనీ డ్రగ్స్‌ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు చెప్పారు. ఏజెంట్లను నియమించుకొని పలు రాష్ట్రాలకు ఇతను సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో సీపీ సీవీ ఆనంద్‌ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. డెకాయిట్‌ ఆపరేషన్‌ చేసి సరఫరాదారులను హైదరాబాద్‌కు రప్పించామని చెప్పారు. ముంబయికి చెందిన ఇద్దరు వ్యక్తులు పంజాగుట్టకు వచ్చి ఓ హోటల్‌లో బస చేయగా దాడి చేసి అరెస్టు చేశామని సీవీ ఆనంద్‌ వెల్లడించారు.

చాదర్‌ఘాట్‌కు చెందిన ఖైసర్‌ ముంబయి ముఠాతో చేతులు కలిపి హైదరాబాద్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు చెప్పారు. తిరుమలగిరి పోలీసులు కూడా ఇద్దరు సభ్యుల గల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి మత్తు పదార్థాల టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారి జాబితా సేకరిస్తున్నామన్నారు. డ్రగ్స్‌ బాధితుల విషయంలో ఇన్ని రోజులు మానవీయ కోణంలో ఆలోచించామని వెల్లడించారు. అవసరమైతే వాళ్లను చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీపీ చెప్పారు. డ్రగ్స్‌ డిమాండ్‌ను తగ్గిస్తే సరఫరా అడ్డుకోవచ్చని సీపీ సీవీ ఆనంద్ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని