IT Raids: హెటిరోపై కొనసాగుతున్న ఐటీ దాడులు.. రూ.150 కోట్లు స్వాధీనం!

హెటిరో డ్రగ్స్‌ సంస్థలపై నాలుగో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో రెండు

Updated : 09 Oct 2021 13:27 IST

హైదరాబాద్‌: హెటిరో డ్రగ్స్‌ సంస్థలపై నాలుగో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. రెండు మూడు ప్రైవేటు లాకర్లలో దాదాపు రూ.150 కోట్లు నగదు ఐటీ బృందాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మూడు కిలోలకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి.  స్వాధీనం చేసుకున్న నగదును కౌంటింగ్‌ చేయడానికి, నోట్ల పరిశీలన కోసం భారతీయ స్టేట్‌ బ్యాంకు చెందిన ప్రత్యేక బృందాలను రప్పించినట్లు సమాచారం. 
ఈ బ్యాంకు అధికారుల బృందాలు నోట్లను పరిశీలించి కౌంటింగ్‌ పూర్తయ్యాక ఆ మొత్తాన్ని ఎస్‌బీఐ సెస్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, నగదు, బంగారంపై ఆరా తీసేందుకు మరొక ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఆ బృందం నగదు, బంగారం స్వాధీనం చేసుకున్న ప్రైవేటు లాకర్లకు నిర్వహకులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని