Crime news: లక్షలాది నగ్న చిత్రాలు, వీడియోలతో మ్యుజిషియన్‌ అరెస్టు!

చిన్నారులతో పెద్దలు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నట్టుగా చిత్రీకరించిన దాదాపు మిలియన్‌కి పైగా ఫొటోలు, వీడియోలను అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు.....

Published : 19 Dec 2021 01:40 IST

రోమ్‌: లక్షలాది చిన్న పిల్లల నగ్న చిత్రాలు, వీడియోల్ని సేకరించి దాచిపెట్టిన ఓ వ్యక్తిని ఇటలీ పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారులతో పెద్దలు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నట్టుగా చిత్రీకరించిన దాదాపు మిలియన్‌కి పైగా ఫొటోలు, వీడియోలను అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వ్యక్తిని ఇటలీలోని మార్చే రీజియన్‌లోని కోస్టల్‌ సిటీ అంకోనాకు చెందిన 49 ఏళ్ల సంగీతకారుడిగా గుర్తించారు. దాదాపు 20ఏళ్లుగా అతడు ఈ ఫొటోలు, వీడియోలను సేకరించినట్టు పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. నగ్న వీడియోలు, ఫొటోలను హార్డ్‌ డిస్క్‌లు, ఆప్టికల్‌ మీడియా, స్మార్ట్‌ఫోన్‌లలో దాచినట్టు గుర్తించామన్నారు. ఆ ఫొటోలు, వీడియోల రకం, బాధితుల వయస్సుల వారీగా వాటిని విభజించి ప్రత్యేక ఫోల్డర్లు రూపొందించాడని వివరించారు. నిందితుడు మైనర్లకు పాఠాలు నేర్పేవాడని, అయితే, అతడు దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆధారాల్లేవని పోలీసులు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని