
TS News: వాళ్లిద్దరూ ప్లాన్ చేసే రవీందర్‌రెడ్డిని చంపేశారా?
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో జరిగిన స్థిరాస్తి వ్యాపారి రవీందర్‌రెడ్డి హత్య కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ధన్వాడ మండలం సంగినేనిపల్లిలో భూవివాదం ఈ హత్యకు దారి తీసిందని రవీందర్‌రెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నాగిరెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మోహన్‌రెడ్డిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నించారు. భూవివాదం నేపథ్యంలో రవీందర్‌రెడ్డిపై నాగిరెడ్డి కక్ష పెంచుకున్నట్లు సమాచారం.
పదేళ్ల క్రితం సంగినేనిపల్లిలో రవీందర్‌రెడ్డి భూమి కొనుగోలు చేశారు. రెండేళ్లుగా ఈ భూమి విషయంలో రవీందర్‌రెడ్డి, నాగిరెడ్డి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మరోవైపు బేగంపేటలోని ఓ ఆస్తి విక్రయంలో కమీషన్ ఇవ్వలేదని మోహన్‌రెడ్డి కూడా రవీందర్‌పై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. దీంతో నాగిరెడ్డితో కలిసి మోహన్‌రెడ్డి.. రవీందర్‌రెడ్డి హత్యకు ప్రణాళిక రచించినట్లు పోలీసులు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. కాగా, వారం క్రితం రవీందర్‌రెడ్డిపై అతడికి బంధువైన మోహన్‌రెడ్డి కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మృతిచెందిన విషయం తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.