కొండచరియలు విరిగి పడి 12 మంది మృతి

మహారాష్ట్రలోని చెంబూరులో కొండచరియలు విరిగి పడి 12 మంది మృతిచెందారు.

Updated : 18 Jul 2021 11:36 IST

ముంబయి: మహారాష్ట్రలో భారీ వర్షాల వల్ల చెంబూరులో కొండచరియలు విరిగి పడ్డాయి. భరత్‌నగర్‌ ప్రాంతంలోని నివాసాలపై ఈ కొండచరియలు పడటంతో గోడలు కూలి 12 మంది మృతిచెందారు. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గోడ కింద చిక్కుకున్న పలువురిని కాపాడారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వివరించారు.

భవనం కూలి ముగ్గురి మృత్యువాత..

ముంబయి నగరాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని విఖ్రోలి ప్రాంతంలో ఓ భవనం కూలి ముగ్గురు మృత్యువాతపడ్డారు. భారీ వర్షాల ధాటికి భవనం కూలినట్లు బీఎంసీ అధికారులు వెల్లడించారు. దీంతో పాటు బోరివాలిలో పార్కింగ్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని