Fake Death: మళ్లీ జైలుకు వెళ్లొద్దని మరో హత్య.. అసలేం చేశాడంటే..!
కుమార్తె హత్య కేసులో జైలుకు వెళ్లి పెరోల్ మీద బయటకు వచ్చిన ఓ వ్యక్తి మళ్లీ జైలుకు వెళ్లకూడదని మరో హత్య చేశాడు. ఓ వ్యక్తిని హతమార్చి......
దిల్లీ: కుమార్తె హత్య కేసులో జైలుకు వెళ్లి పెరోల్ మీద బయటకు వచ్చిన ఓ వ్యక్తి మళ్లీ జైలుకు వెళ్లకూడదని మరో హత్య చేశాడు. ఓ వ్యక్తిని హతమార్చి.. తానే మరణించినట్లు పోలీసులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. సదరు నిందితుడితోపాటు అతడికి సహకరించిన భార్యను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అసలేం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌కు చెందిన సుదేశ్ తన 13 ఏళ్ల కుమార్తె హత్య కేసులో 2018లో జైలుకెళ్లాడు. కరోనా తీవ్రరూపంలో ఉన్నప్పుడు పెరోల్‌పై బయటకొచ్చాడు. అయితే త్వరలోనే తన పెరోల్ గడువు ముగిసిపోనుందని, మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడిన సుదేశ్ మదిలో ఓ వికృత ఆలోచన తట్టింది. ఓ వ్యక్తిని హతమార్చి.. అది తన మృతదేహం అని పోలీసులను పక్కదారి పట్టించాలని భావించాడు. ఈ విషయాన్ని భార్యకు వివరించాడు.
తన ప్లాన్‌ను అమలుచేందుకు.. తన ఇంటికి సమీపంలో నివసించే ఓ కూలీని గత నవంబర్ 20న లోనీ ప్రాంతానికి సుదేశ్ పిలిపించుకున్నాడు. అక్కడే ఇద్దరు కలిసి మద్యం సేవించారు. సదరు కూలీ మత్తులోకి జారుకున్నాక అతడి తలపై కర్రతో పలుమార్లు బాది హతమార్చాడు. అతనంతరం అతడి ముఖాన్ని గుర్తుపట్టకుండా కాల్చేశాడు. మృతుడి జేబులో తన ఆధార్ కార్డును పెట్టి.. మృతదేహాన్ని అక్కడే వదిలేసి సుదేశ్ పరారయ్యాడు. మృతదేహం గురించి మరుసటి రోజు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని పరిశీలించగా అతడి జేబులో ఆ ఆధార్ కార్డు లభించింది. దీంతో సుదేశ్ భార్యను పిలిపించి విచారించగా.. అది తన భర్త మృతదేహమేనని ఆమె వెల్లడించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ హత్యపై విచారణ జరుపుతున్నారు.
అయితే సుదేశ్ చనిపోలేదని, అతడు బతికే ఉన్నాడని పోలీసులకు తాజాగా సమాచారం అందింది. దీంతో అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రశ్నించగా.. తాను చేసిన నిర్వాకాన్ని వెల్లడించాడు. అతడికి సహకరించిన భార్యను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా.. తన భర్త కనిపించడం లేదంటూ సదరు కూలీ భార్య చేసిన ఫిర్యాదు ఆధారంగా.. మృతదేహాన్ని వారికి చూపించడంతో కూలీ కుటుంబసభ్యులు శోకంలో మునిగిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావు చెప్పినట్లే చేశా!’
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు ఆయన్ను దర్యాప్తు బృందం విచారించింది. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్‌లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్‌ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్‌లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం