
Murder in Vijayawada: విజయవాడ వించిపేటలో వ్యక్తి దారుణ హత్య
విజయవాడ: నగరంలోని పాతబస్తీ వించిపేటలో ఇమ్రాన్ అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి విచారణ చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి స్థానికంగా నివాసముండే జాఫర్‌తో ఇమ్రాన్ గొడవ పడినట్లు ప్రాథమిక సమాచారం సేకరించారు. మృతుడిపై గతంలో దోపిడీ కేసులు ఉన్నాయని గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలు విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.