Crime News: ‘నన్ను పెళ్లి చేసుకో.. లేదంటే చంపేస్తా’

వివాహితను పెళ్లి చేసుకోవాలంటూ బెదిరించిన ఘటనలో యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. జవహర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతిరావు తెలిపిన వివరాల

Updated : 08 Sep 2021 10:05 IST

జవహర్‌నగర్‌, న్యూస్‌టుడే: వివాహితను పెళ్లి చేసుకోవాలంటూ బెదిరించిన ఘటనలో యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. జవహర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్‌నగర్‌కాలనీకి చెందిన అరుణ్‌కుమార్‌ త్యాగి(47) స్థానికంగా యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్నాడు. అందులో భాగస్వామిగా ఉన్న వివాహితను పెళ్లి పేరుతో వేధింపులకు గురి చేశాడు. అనంతరం చేతులు కోసుకుని చనిపోతానంటూ బెదిరించాడు. బాధితురాలు జూన్‌ 26న జవహర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకి పంపారు. అనంతరం జులై 28న బెయిలుపై బయటికి వచ్చిన నిందితుడు తిరిగి ఆమెను వేధించం మొదలు పెట్టాడు. కేసును వెనక్కి తీసుకోవాలని, తనని వివాహం చేసుకోవాలని.. లేదంటే చంపేస్తానంటూ బాధితురాలిని బెదిరించాడు. మరో మహిళకు సైతం ఫోన్‌లో అసభ్య సందేశాలను పంపిస్తూ వేధిస్తున్నాడు. దీంతో ఇరువురి ఫిర్యాదుతో పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు